* సంక్రాంతికి నగరవాసులు పల్లెబాట పట్టడమే కారణం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరించడం, నూతన కాలనీల ఏర్పాటు, పరిశ్రమల రాకతో ప్రతి ఏడాది విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వరుస సెలవులు రావడంతో నగరవాసులు పెద్ద సంఖ్యలో పల్లెబాట పట్టడంతో నగరం సగానికి పైగా ఖాళీ అయ్యింది.
దీంతో విద్యుత్ వినియోగం సైతం భారీగా తగ్గింది. సాధారణంగా జనవరిలో చలి ప్రభావం నేపథ్యంలో విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంటుంది. అయితే దీనికి సంక్రాంతి సెలవులు తోడవడంతో ఈనెల 11వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది.
ఈ పరిస్థితిలో సంక్రాంతి పండుగ కంటే ముందు 7వ తేదీన అత్యధికంగా 3,271 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ ఉండగా, 14న విద్యుత్ వినియోగం 2,580 మెగావాట్లుగా నమోదయ్యింది. ఓసారి సంక్రాంతికి ముందు, సంక్రాంతి సందర్భంగా విద్యుత్ వినియోగాన్ని గమనిస్తే..