calender_icon.png 5 January, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన క్రైం రేట్.. పెరిగిన సైబర్ క్రైం

31-12-2024 01:50:57 AM

  • అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా

ప్రజలకు అందుబాటులో ఉంటూ చర్యలు తీసుకుంటాం

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి

కరీంనగర్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): కరీంనగర కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంలో క్రైం రేట్ తగ్గిందని, సైబర్ క్రైం పెరిగిందని, ఆర్థిక నేరాలు, భూక బ్జాలపై ఉక్కుపాదం మోపామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. సోమవారం 2024 సంవత్స రానికి సంబంధించి వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భం గా సీపీ మీడియాతో మాట్లాడుతూ 2025 సంవత్సరంలో రెగ్యులర్ పోలీసులతోపాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టను న్నామని తెలిపారు. విజిబుల్ పోలీసింగ క్కు మరింత ప్రాముఖ్యత పెంచనున్నామన్నారు. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, రౌడీషీటర్లు, వీధి రౌడీలుగా చెలామణి అయ్యేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పు డు గమనిస్తామని తెలిపారు.

ఆర్ధిక నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తా మని తెలిపారు. సైబర్ క్రైం, యాంటీ డ్రగ్ అవగాహన, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చొరవ తీసు కుంటున్నామని, పోలీస్ సేవలు కమిషనరేట్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

2024 సంవత్సరం లో డయల్ 100 ద్వారా 46,191 ఫిర్యాదు లు వచ్చాయని, వాటికి స్పందించడం జరి గిందని తెలిపారు. కమిషనరేటవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు 18,625 ఫిర్యాదులు అందాయని, ఇందులో ఫైనాన్స్కు సంబం ధించినవి 23 శాతం, శారీరక నేరాలకు సంబంధించి 11 శాతం, రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి 5 శాతం, ఇతర నేరాలు 21 శాతంగా ఉన్నాయని తెలిపారు.

సీసీసీ ద్వారా ఈ సంవత్సరం 3121 ఫిర్యాదులు అందాయని, ఇందులో భూమికి సంబంధిం చినవి అత్యధికంగా 57 శాతం ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా 7,027 కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, ఇందులో 5,180 కేసుల విచారణ పూర్తయిందని తెలిపారు. 

ఆర్థిక నేరాలపై 726 కేసులు

ఈ సంవత్సరం ఆర్థిక నేరాలకు సంబంధించి 726 కేసులు నమోదుకాగా, ఇందులో సైబర్నేరాలు 46 శాతం ఉన్నాయని తెలిపారు. అల్లర్లు, దొమ్మి కేసులు తగ్గాయని, ఈ సంవత్సరం 14 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం లో పోలిస్తే 44 శాతం తగ్గాయని, రాబరి, డెకాయిటింగ్ కేసులు 38 శాతం తగ్గాయని తెలిపారు.

హత్యలకు సంబంధించి కూడా 33 శాతం నేరాలు తగ్గాయని, ఈ సంవత్స రం 14 కేసులు నమోదయ్యాయని తెలిపా రు. చైన్ స్నాచింగ్ కు సంబంధించి 30 శాతం నేరాలు తగ్గాయని, ఈ సంవత్సరం ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని పేర్కొన్నారు. ఆర్ధిక సైబర్ నేరాలకు సంబంధించి 2024 సంవత్సరంలో 2282 ఫిర్యాదులు అందాయని తెలిపారు.

233 కేసుల్లో బాధితులు కోల్పోయిన 9.87 కోట్ల రూపాయలను హోల్డ్లో ఉంచగలిగామని తెలిపారు. కమిషనరేటవ్యాప్తంగా ఈ సంవ త్సరంలో భూతగాదాలకు సంబంధించి, నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేసిన ఘటనలో 113 కేసులు నమోదయ్యాయని, 173 మందిని అరెస్టు చేయడం జరిగిందని, ఇందులో 60 కేసులు నకిలీ సరిహద్దులు సృష్టించినందుకు నమోదయ్యాయని తెలి పారు.

చిట్ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయని, ఇందులో 9 మంది చిట్ ఫండ్ డైరెక్టర్లతోపాటు 16 మందిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మాదక ద్రవ్యాలు, గంజాయికి సంబంధించి 39 కేసులు నమోదయ్యా యని, 85 మందిని అరెస్టు చేసి 128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

జూదానికి సంబంధిం చి 91 జూదం కేసుల్లో 593 మందిని అరెస్టు చేయడం జరిగిందని, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి 99 కేసులు నమోదు చేసి 189 మందిని అరెస్టు చేసి 96 వాహనాలు, 4,289 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 

4,257 లీటర్ల మద్యం స్వాధీనం

ఎక్సుజ్ కేసులకు సంబంధించి 360 కేసులు నమోదు చేయడం జరిగిందని, 4,257 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకో వడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ నియం త్రణకు సంబంధించి మూడు సమన్వయ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిం చడం జరిగిందని, 50 స్పెషల్ డ్రైవ్లు నిర్వ హించడం జరిగిందని, ఐదు జంక్షన్లలో ట్రా ఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను అందుబాటులోకి తీ సుకురావడం జరిగిందని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 6005 మందిపై కేసులు నమోదు చేయగా 147 మందికి శిక్ష పడిందని తెలిపారు. కరీంనగర్ పోలీసులు తీసుకున్న క్రియాశీల చర్యల్లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్ర మాలు ముఖ్యమైనవని, 56 కళాశాలలు, పాఠశా లల్లో యాంటీ డ్రగ్ సమావేశాలు నిర్వహిం చడం జరిగిందని, 158 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.