calender_icon.png 15 January, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లాభం

08-08-2024 02:39:56 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 7:  ఎరువులు, సస్యరక్షణ ఔషధాల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ కన్సాలిడేటెడ్  నికరలాభం జూన్‌తో ముగిసిన క్యూ1లో రూ.309 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 494 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.5,737 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు తగ్గింది. కనిష్ఠ సబ్సిడీ రేట్లు, ముడి వ్యయాలు పెరగడంతో ఎరువుల వ్యాపారంలో మార్జిన్లు తగ్గాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శంకర సుబ్రమణియన్ తెలిపారు. ముగిసిన త్రైమాసికంలో డ్రోన్ కంపెనీ దక్షలో తమ వాటాను 58 శాతానికి పెంచుకున్నామని, క్లీన్‌టెక్ స్టార్టప్ ఎకోజోన్‌లో 5.5 శాతం వాటాను కొనుగోలు చేశామని వివరించారు.