calender_icon.png 2 February, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

02-02-2025 12:39:02 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఏడు రూ పాయల మేర తగ్గించాయి. తగ్గించిన ధరలు దేశ వ్యాప్తంగా ఆదివారం నుంచే అమలోకి వచ్చాయి.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1,797కే లభ్యమవుతుంది. అయితే 14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. గత నెలలో కూడా మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ను రూ.14.50మేర తగ్గించిన విషయం తెలిసిందే.