calender_icon.png 16 November, 2024 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన అశోక్ లేలాండ్ వాహన విక్రయాలు

05-11-2024 12:00:00 AM

ముంబై: హిందూజా గ్రూప్‌కు చెం దిన వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ వాహన అమ్మకాలు.. అక్టోబర్లో 9 శాతం క్షీణించి 15,310 యూనిట్లకు పడిపోయాయని తెలిపిం ది. ఈ సంస్థ గతేడాది అక్టోబర్లో మొ త్తం 16,864 వాహనాలను విక్రయించింది. ఈ అక్టోబర్లో ఎగుమతులతో స హా మొత్తం మధ్యస్థ, భారీ వాణిజ్య వాహన  విక్రయాలు 9,408గా నమోదయ్యాయి.

గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 10,185 వాహనాలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో విక్రయాలు 8 శాతం పడిపోయాయని కంపెనీ తెలిపింది. తేలికపాటి వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి 5,902 యూని ట్లుగా నమోదయ్యాయి. 2024 అక్టోబర్లో మొత్తం దేశీయ వాణిజ్య వాహ నాలు, తేలికపాటి వాణిజ్య వాహన విక్రయాలు 11 శాతం తగ్గి 14,067కు చేరుకున్నాయి.