- రూ. 95,298 కోట్ల నిధులు
- ఈథర్‌నెట్ స్విచెస్‌పై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఐటీ, టెలికాం రంగాలకు రూ. 95, 928 కోట్ల నిధులు కేటాయించారు. ఈ కేటాయింపులు గతేడాదితో పోలిస్తే తక్కువ. కానీ ఈ సారి ప్రకటించిన బడ్జెట్‌లో ఈథర్‌నెట్ స్విచెస్ మీద కస్టమ్ డ్యూటీని 10 శాతానికి తగ్గించారు.
గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. డేటా సెంటర్లలో సర్వర్లను కనెక్ట్ చేసేందుకు ఈ ఈథర్‌నెట్ స్విచ్‌లు ఉపయోగపడతాయి. క్యారియర్-గ్రేడ్-ఈథర్‌నెట్ స్విచ్చెస్ మీద కస్టమ్స్ డ్యూటీని 20 నుంచి 10 శాతానికి తగ్గించారు.
టెలికాం రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెంపు కోసం ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. డిసెంబర్ 2024 వరకు 6.92 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) వేయబడింది. అందులో 2.14 లక్షల కిలోమీటర్ల మేర గ్రామపంచాయతీల్లో ఈ లైన్లు విస్తరించబడ్డాయి.