calender_icon.png 20 March, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన వ్యవసాయం

20-03-2025 12:00:00 AM

  1. గతేడాది రూ. 72,630 కోట్లు కేటాయింపు..
  2. 2025-26 బడ్జెట్‌లో రూ. 60,384 కోట్లే
  3. అప్పటితో పోలిస్తే రూ. 12,246 కోట్లు తక్కువ
  4. సాగునీటిరంగానికి రెట్టింపు కేటాయింపు

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు తగ్గాయి. గత బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.72,630 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.60,384కోట్లు మాత్ర మే కేటాయించారు. అయితే సాగునీటి రంగంతో కలిపితే మాత్రం కేటాయింపులు ఎక్కువే అవుతున్నాయి.

గతేడాది సాగునీటికి రూ.10,829కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది మాత్రం రెట్టింపు చేస్తూ రూ. 23,373 కోట్లు కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, పశుసంవర్ధకం, నీటిపారుదల శాఖలకు కలిపి రూ.49,486కోట్లను కేటాయించారు. దీనిలో వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించగా, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, పశుసంవర్ధకానికి రూ.1,674 కోట్లను కేటాయించారు.

ఇక వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా రూ.11,500కోట్లు కేటాయించారు. మొత్తం కలిపి రూ.60,384 కోట్లు కాగా.. గతేడాదితో పోలిస్తే రూ. 12,246 కోట్లు తక్కు వ. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఈ బడ్జెట్‌లో కేవలం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,800కోట్లు కేటాయించారు.

కాగా గతేడాది రుణమాఫీ కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.26వేల కోట్లు కాగా.. రూ.20,616 కోట్లు మాత్ర మే ఖర్చు చేసి పథకాన్ని పూర్తి చేసినట్లు సర్కారు చెబుతోంది. ఇక రైతు భరోసా పథకానికి నిరుడు రూ. 15వేల కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.3వేల కోట్లు ఎక్కువగా కేటాయించారు.

గతేడాది పంటల బీమా కోసం రూ.1,300 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది కేటాయింపుల వివరాలు పొందుపర్చలేదు. గతేడాది నీటిపారుదల శాఖకు రూ.10,829 కోట్లు మాత్ర మే కేటాయించగా ఈ ఏడా ది దాదాపు రెట్టింపు చేస్తూ.. రూ.23,373 కోట్లు కేటాయించారు.