calender_icon.png 5 November, 2024 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు తగ్గించండి

22-07-2024 02:48:27 AM

బంగ్లాదేశ్ సుప్రీం కీలకతీర్పు

30% నుంచి 5 శాతానికి తగ్గించాలన్న న్యాయస్థానం

పంతం నెగ్గించుకున్న విద్యార్థులు 

అల్లర్లలో ఇప్పటికే 1౫౧ మంది విద్యార్థులు మృతి

ఢాకా, జూలై 21: రిజర్వేషన్లకు వ్యతిరేకం గా విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. బంగ్లావిముక్తి కోసం పోరాడిన సమర యోధుల పిల్లలకు కేవలం 5 శాతం మాత్ర మే రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా 93 శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, మిగిలిన రెండు శాతంలో మైనారిటీలకు ఒక శాతం, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం అభిప్రాయపడింది. 

నాలుగోసారి ఏర్పడిన షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లా విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడంతో ఈ రగడ మొదలైంది. చిలికి చిలికి గాలి వానలా తయారయి హింసాత్మక దాడులకు దారి తీసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 1౫1 మంది మరణించినట్లు నివేదికలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశ ప్రభుత్వం ఈ అల్లర్లను అదుపుచేసేందుకు శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ విధించినా, ఇంటర్నెట్ సదుపాయం నిలుపుదల చేసినా ఫలితం లేకపోయింది. ఇక చివరికి సుప్రీం కలగజేసుకుని రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అసలేంటీ రిజర్వేషన్ ఎందుకీ రగడ.. 

1971కి ముందు ఇప్పటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది. 1971వ సంవత్స రంలో తిరుగుబాటు మొదలైంది. బంగ్లాదేశ్ విముక్తి కోసం అప్పుడు అనేక మంది ఉద్యమబాట పట్టారు. పాక్ సైన్యంపై వీరోచితంగా పోరాడారు. ఇలా పోరాటాలు చేసిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీ నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. 30 శాతం రిజర్వేషన్ అంటే దాదాపు 1/3 సీట్లు వారికే పోతున్నాయి. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు నష్టపోతారని మేధావులు ఆరోపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే ఉద్య మం మొదలై తీవ్ర రూపం దాల్చింది. ఇక చివరకు సుప్రీం కలగజేసుకుని ఆ వివాదాస్పద నిర్ణయాన్ని రద్దు చేసింది.