calender_icon.png 22 November, 2024 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టు వర్క్ తగ్గించండి

22-11-2024 12:55:57 AM

విద్యాకమిషన్‌కు టీచర్ల విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): విద్యార్థులకు పరీక్షలు, ప్రాజెక్టులు తగ్గించాలని తెలంగాణ విద్యాకమిషన్ ను టీచర్లు కోరారు. గురువారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో 30 మంది ఉపాధ్యా యులతో తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీసీఈ (సమగ్ర మూల్యాంకన విధానం) మార్పులపై సమావేశం నిర్వహించారు.

ఉపాధ్యా యుల నుంచి సలహాలు, సూచనలను కమిషన్ స్వీకరించింది. అయితే సీసీఈ విధానం వల్ల ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థలకు రాత పని, ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉంటోందని కమిషన్ దృష్టికి టీచర్లు తీసుకెళ్లారు. ఈవిధానంతో విద్యార్థులు శారీ రకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

పైగా విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారని కమిషన్‌కు వివరించారు. పరీక్షలు, ప్రాజెక్టులను తగ్గించాలని కమిషన్‌ను కోరడంతో పరీక్షలను తగ్గించే అవకాశం ఉండదని, అవి అలాగే ఉంటాయని కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వారితో తెలిపారు. కొంతమేరకు ప్రాజెక్టుల ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ‘విజయ క్రాంతి’తో చెప్పారు. త్వరలో మరోసారి కమిషన్ దీనిపై భేటీ కానుంది.