అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందంగా ఉన్నా.. ముఖంలోని చెం పలపై ఉండే కొవ్వు ఇబ్బందికరంగా ఉంటుంది చాలామందికి. కొందరు సర్జీలు చేయించుకొని ఫ్యాట్ తగ్గిం చుకుంటున్నారు. దాని వల్ల సత్వర ప్రయోజనం ఉన్నా ఆ తర్వాత అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే సర్జరీలు లేకుండా ఈజీగా బుగ్గలపై ఉండే కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇదే విషయమై ఫిట్‌నెస్ నిపుణుడు పాథిక్ పటేల్ మాట్లాడుతూ.. మహిళలతోపాటు మగవారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు శరీరమంతా కొవ్వు తగ్గడం జరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఫిట్ గా ఉండొచ్చు. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా బాడీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా ముఖంలోని కొవ్వు కూడా తగ్గుతుంది.
“నేను క్రమం తప్పకుండా పరిగెత్తడం, సైకిల్ తొక్కడం లేదా ఇతర వ్యాయామాలు కూడా చేస్తాను. దాంతో ఇవన్నీ కొవ్వును కరిగించి కేలరీలను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకోసం హైడ్రేటెడ్‌గా ఉండటం, చక్కెర పదార్థాలను తక్కువగా తీసుకోవడం, అధిక సోడియం తీసుకోవడం తగ్గించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముఖంలో ఉబ్బును తగ్గిస్తుంది.
అలాగే యోగా నిపుణులు మాట్లాడుతూ యోగాలోని వివిధ భంగిమల ద్వారా ప్రాణా యామ పద్ధతులను క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖ సౌందర్యం పెరగడమే కాకుండా కొవ్వు తగ్గుతుందని అంటున్నారు. క్రమం తప్పకుండా ఫేస్ యోగా చేయడం వల్ల అందం పెరగడంతో పాటు కొవ్వు తగ్గుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి మరి.