calender_icon.png 2 November, 2024 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాప విమోచనం

19-07-2024 12:00:00 AM

పూర్వం ‘జడుడు’ అనేవాడు సకల ఆచారాలను అన్నింటినీ త్యజిస్తాడు. దురాచార పరుడై సంచరిస్తూ ఉంటాడు. ధనాశాపరుడూ అవుతాడు. ఒకనాడు వ్యాపారం కోసం ఉత్తర దిశకు వెళతాడు. అటునుండి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కొందరు దొంగలు అతనిని చుట్టుముట్టి, ఒక చెట్టు కిందికి తీసుకెళ్లి దారుణంగా చంపేస్తారు. ఏమవుతుంది, అతడు పాపాత్ముడు కనుక, మరణానంతరం పిశాచ రూపాన్ని పొందుతాడు. కొంతకాలానికి ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరపడానికి కాశీకి వెళుతుంటాడు. తోవలో తన తండ్రి హత్యకు గురైన వృక్షం కింద కూర్చుని, అక్కడ భగవద్గీతలోని మూడవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు. అంతే! వెంటనే జడుని ప్రేతాత్మ రూపం కాస్తా తొలగి పోతుంది. దివ్య దేహంతో స్వర్గానికి వెళుతూ, ఆనందంతో కుమారుని కేసి చూస్తూ అంటాడు, “నాయనా! నువ్వు ఇప్పుడు గీత మూడవ అధ్యాయాన్ని పఠించిన పుణ్యమే నా ప్రేతరూపాన్ని తొలగించింది. కనుక, అత్యంత మహిమాన్వితమైన తృతీయ అధ్యాయాన్ని నువ్వు మరవకుండా నిత్యం పారాయణం చేయవలసింది సుమా!” అని ఆశీర్వదిస్తాడు.

 కలకుంట్ల జగదయ్య