26-03-2025 10:23:40 PM
డాక్టర్ సుధాకర్ గౌడ్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో నేడు, రేపు రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారనీ తెలిపారు. పోటీలను ప్రారంభిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు రేపు జరగబోయే "ఎయిడ్స్, సుఖ వ్యాధుల" పై అవగాహన కార్యక్రమంలో బహుమతులను అందజేస్తామని జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ అంజయ్య బందెల తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ ప్రతిజ్ఞ డాక్టర్ వీరభద్రం, డాక్టర్ అంజయ్య వ్యవహరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.