తన తొలి సినిమా ‘మేం ఫేమస్’తో యాక్టర్‌గా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్ ప్రభాస్. తాను హీరోగా ఇప్పుడు రెండో చిత్రాన్నీ ప్రకటించాడు. ఈ కొత్త సినిమాను నూతన నిర్మాణ సంస్థ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావటం విశేషం. పలు షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైన సుభాష్ చంద్ర ఈ చిత్రంతో బిగ్ స్క్రీన్కు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
జగపతిబాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంతో నిధి ప్రదీప్ హీరోయిన్గా పరిచయమవుతోంది. అయితే, ఈ కొత్త సినిమా ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టగా, నిర్మాత సురేశ్‌బాబు కెమె రా స్విచాన్ చేశారు.
దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌ ర్యువ్, మహేశ్‌బాబు పీ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకలో సునీల్ నారంగ్ కూడా పాల్గొన్నారు.