ప్యాంగ్యాంగ్, మే 13: కమ్యూనిస్టు నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఉక్కు పిడికిట్లో ఉన్న ఉత్తరకొరియాలో మరో కఠిన నియమం అమల్లోకి వచ్చింది. ఆ దేశంలో ఇకపై మహిళలు ఎరుపురంగు లిప్‌స్టిక్ వాడరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రెడ్ లిప్‌స్టిక్ పెట్టుబడిదారీ విధానానికి సంకేతమని, అందుకే దానిని తమ దేశంలో నిషేధించామని ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటికే మహిళలు మేకప్ వేసుకో వటంపై నిషేధం అమలవుతున్నది. వీటిని అనుమతిస్తే ప్రజలు పాశ్యాత్య సంస్కృతికి ఆకర్షితులవుతారని కిమ్ సర్కారు భయపడుతున్నట్టు సమాచారం. ఆ దేశంలో నీటిరంగు టైట్ జీన్స్, ఆభరణాలు, విచిత్రమైన కేశాలం కరణలపై నిషేధం కొనసాగుతున్నది. వీటిని అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఉంటాయి.