హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తునకు సిద్ధమన్న సీబీఐ
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీ పీఎల్)కి అక్రమంగా భూముల కేటాయింపుపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టు ఆదేశాలను జారీచేస్తే ఉమ్మ డి ఏపీ సీఎం హోదాలో నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని రూ.కోట్ల విలు వైన 855 ఎకరాల భూములను కేటాయించడంపై విచారణకు సిద్ధమని వెల్లడించింది. మౌలిక వసతుల లేమీ కారణంగా ప్రాథమిక విచారణ సీఐడీతో చేయించి వివరాలు ఇవ్వాలని కోరామేగానీ దర్యాప్తునకు ఏనా డూ వెనుకడుగు వేయలేదని చెప్పింది.
హైదరాబాద్ పరిధిలో 855 ఎకరాల ప్రభుత్వ భూములను (తాజా విలువ ప్రకారం రూ.లక్ష కోట్లు) నామమాత్రపు ధరకు అంతర్జాతీయ క్రీడా సంస్థ ఐఎంజీతో సంబంధం లేని ఐఎంజీ భారత అనే బోగస్ సంస్థకు చంద్రబాబు సర్కార్ కేటాయింపు చేసింది. రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని పలు స్టేడియాలనూ అప్పగించింది. ఈ భూదందాపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీనియర్ జర్నలిస్ట్ ఏబీకేప్రసాద్, అడ్వొకేట్ శ్రీరంగారావు హైకోర్టులో 2012లో పిల్స్ వేశారు. వీటిపై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.
క్రీడాభివృద్ధి పేరిట ఐఎంజీ భారతకు మామిడిపల్లి, శేరిలింగంపల్లిలో చంద్ర బాబు ప్రభుత్వం 2003లో భూమి కేటాయించింది. రిజిస్ట్రేషన్ చార్జీల రాయితీలు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు బినామీలకు కట్టబెట్టారు అని పిల్స్‌లో పేర్కొన్నారు. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదిస్తూ హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తునకు సిద్ధం గా ఉందన్నారు. ఇది భారీ కుంభకోణమని, ఐఎంజీ భారతకు భూ కేటాయింపుల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిద్ధమని చెప్పారు.
చంద్రబాబు క్యాబినెట్లోని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా చేసిన రాములు తరఫున సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదిస్తూ, ఇది పిల్ కాదని, 2003 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారతకు భూకేటాయింపు ఉత్తర్వులను తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఈ చర్యను సవాల్ చేస్తూ ఐఎంజీ భారత తరఫున బిల్లీరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని, వైఎస్ ప్రభుత్వం జారీచేసిన భూముల రద్దు జీవోను సమర్ధించిందని, ఈ నేపథ్యంలో పిల్‌పై విచారణ అవసరం లేదని చెప్పారు. నేడూ విచారణ కొనసాగనున్నది.
తుది తీర్పునకు లోబడి గ్రూప్-4 నియామకాలు
ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ల కేసులో హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గ్రూప్-4 పోస్టుల భర్తీ చేసేట ప్పుడు ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించలేదంటూ దాఖలైన పిటిష న్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నియామకాలు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే నియామకాలు మొదలైన ందున నిలుపుదల చేయబోమని చెప్పింది ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయా లని ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది. గ్రూప్-4 భర్తీ కోసం ప్రభుత్వం 2022 డిసెంబరులో నోటిఫికేషన్ వెలువరించింది.
అందులో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించలేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన దేవత్ శ్రీను, దేవత్ తనుశ్రీతోపాటు మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యం న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయసేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు 2014లోనే తీర్పు చెప్పిందని గుర్తుచేశారు. పది రోజుల గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు.