calender_icon.png 22 April, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థులకు రెడ్ క్రాస్ చేయూత

15-04-2025 01:28:35 AM

ఎమ్మెల్యే యెన్నం చేతుల మీదుగా రూ. రెండు లక్షల చెక్కుల అందజేత

మహబూబ్ నగర్ రూరల్ ఏప్రిల్ 14 : వైద్య విద్యను అభ్యసిస్తున్న జిల్లా కు చెందిన ఇద్దరు విద్యార్థినీలకు  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  రెడ్ క్రాస్ విద్యా నిధి నుంచి రూ.లక్షల ఆర్థిక సహాయం అందించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ లోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యం బి బి ఎస్ ఫైనల్ చదువుతున్న  గోపిక ( గాంధీ మెడికల్ కాలేజ్) హరిత ( కాక తీయ మెడికల్ కాలేజ్) లకు చెక్కులను ఇచ్చారు.

ఇటీవల విడుదలైన యం బి బి ఎస్  తృతీయ సంవత్సరం ఫలితాల్లో  మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన గోపిక, హరిత లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్, కోశాధికారి ఎస్.జగపతి రావు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్, మేనేజర్ అనేల నరసింహా తదితరులు పాల్గొన్నారు.

సన్న బువ్వ సంతృప్తికరం 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 14 (విజయ క్రాంతి) : ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ద్వారా వండిన సన్న బువ్వ చాలా సంతృప్తికరంగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పాలమూరు పట్టణ కేంద్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన సన్న బియ్యం లబ్ది దారుని ఇంటిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ భోజనం చేశారు.

రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్న బియ్యం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బెక్కరి అనిత, ప్రశాంత్, సాయిబాబా, తాసిల్దార్ ఘాన్సిరాం నాయక్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

-ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి