19-03-2025 10:24:10 AM
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Former SIB chief Prabhakar Rao), శ్రవణ్ కుమార్(Sravan Kumar)ను భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమం అయింది. ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. రెడ్ కార్నర్(Red Corner Notice) నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి(Telangana Crime Investigation Department) సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు. డీహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు తెలిపారు.