calender_icon.png 1 November, 2024 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ... మరో నాలుగు రోజులు వర్షాలు

18-07-2024 07:50:49 PM

హైదరాబాద్: తెలంగాణలో రాగల 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు 4 రోజుల పాటు  పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.అదే విధంగా వాయువ్య బంగాళాఖాతంలో మరొ అల్పపీనడం ఏర్పడిందని దీని ప్రభావంతో  శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహాబూబాద్‌లలో ఒక మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్  జారీ చేసింది.

గురువారం నారాయణ పేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్‌లో భారీ వర్షాలు కరువగా కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ, వికారాబాద్, మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో ఒక మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, మెడ్చెల్   మల్కాజిగిర, యాదాద్రి భవనగిరి,  రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేఊట, జనగాం, వరంగల్, హన్మకొండ, మహాబూబాబాద్, సిద్దిపేట, జగిత్యాల. పెద్దపల్లి రాజన్న సరిసిల్ల,ఆదిలాబాద్, కుమ్రం భీమ్, మంచిర్యాల, నిర్మల్ లలో సాధారణ వర్షపాతం నమోదైనట్ల చెప్పారు.