calender_icon.png 17 January, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ అలర్ట్

01-09-2024 01:50:24 AM

రాబోయే రెండు రోజుల్లో ౯ జిల్లాల్లో కుంభవృష్టి 

మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆది, సోమ వారాల్లో మరింత అప్రమత్తత  

జలదిగ్బంధంలో పలు గ్రామాలు, నిలిచిన రాకపోకలు 

జడ్చర్ల 100 పడకల ఆసుపత్రి చుట్టూ చేరిన వర్షపునీరు

పిడుగుపడి తెగిన విద్యుత్ తీగలు.. కరెంట్ షాక్‌తో యువతి మృతి

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం.. చెరువులు, కుంటలకు జళకల 

హైదరాబాద్‌లో సోమవారం స్కూళ్లకు సెలవు

 హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): అల్పపీడనం వాయుగుం డంగా బలపడటంతో దాని ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 9 జిల్లాల వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఆదివారం నాడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కమ్మం, నల్లగొండ జిల్లాల్లో,  సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో  సోమవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.

40 నుంచి 50 కిమీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.  రాబోయే రెండు రోజుల్లో  అత్యంత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలంటూ  ఆదేశిం చారు. హైదరాబాద్ వాతావరణ శాఖ  ఆరెం జ్, ఎల్లో హెచ్చరికలు జారీచేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం యం త్రాంగం నిమగ్నమయింది. వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం రాబోయే వారం రోజుల పాటు వర్షసూచన ఇలా ఉం డనుంది.. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల వరకు కురిసే వర్షపాతం అంచనా ఆధారంగా..

  1.9.2024..

అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు (రెడ్ అలర్ట్) :  కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉన్న జిల్లాలు (ఆరెంజ్ అలర్ట్) : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు (యెల్లో అలర్ట్) : భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్

  2.9.2024..

రెడ్ అలర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, నిర్మల్,  నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి

యెల్లో అలర్ట్ జిల్లాలు: సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహ బూబాబాద్, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్

 3.9.2024..

 యెల్లో అలర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట

 4.9.2024.. 

యెల్లో అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబా ద్, జగిత్యాల, సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలప్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం

  5, 6, 7 తేదీల్లో.. 

ఈ మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.