జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 28 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థులకు -తెలం గాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 2,050 (స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్) ఉద్యోగాల భర్తీకి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డీఎంఈ పరిధిలో 1,576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పరిధిలో 332 పోస్టులు, ఆయుష్‌లో 61, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఒక పోస్ట్, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ కేంద్రంలో 80 పోస్టులు.. మొత్తం 2,050 పోస్టులు ఉన్నాయి.
ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 28 నుంచి నుంచి అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 14 గడువు విధించారు. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే అక్టోబర్ 16న ఎడిట్ ఆప్ష న్ ఇచ్చారు. పరీక్ష నవంబర్ 17న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. పరిస్థితులను బట్టి పోస్టుల సంఖ్య పెరగడం గానీ తగ్గడం గానీ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాల దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎమ్) లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినవారు అర్హులు. పూర్తి వివరాలకు <https:// mhsrb.telangana.gov.in> వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.