113 మంది అభ్యర్థులకు అందజేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఇటీవలే రవాణా శాఖలో అసి స్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ)గా ఉద్యోగాలు సాధించిన 113 మంది అభ్యర్థులకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో ఉన్న రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలను అందిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం పాల్గొంటారు. రవాణా శాఖలో ఇన్‌స్పెక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో ఒకేసారి 113 మంది ఏఎంవీఐలను నియమి స్తుండటంతో కొంతమేర ఇబ్బందులు తొలిగే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కేవలం కార్యాలయం విధులకే ఇన్‌స్పెక్టర్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది.
కొత్త నియామకాల వల్ల క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు, జరిమానాలు విధించేందుకు, శాఖకు ఆదాయం పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటు న్నారు. తెలంగాణలో కొత్త వాహన చట్టాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఈ నియామకాలు కొంతమేర ఉపయోపడనున్నాయి.