calender_icon.png 25 October, 2024 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న విలువైన స్మార్ట్ ఫోన్లు రికవరీ..

25-10-2024 04:47:39 PM

బాధితులకు అప్పగించిన ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని వినియోగదారులు అనుకోని పరిస్థితుల్లో పోగొట్టుకున్న విలువైన స్మార్ట్ ఫోన్లన్నీ పోలీసులు తిరిగి బాధితులకు వెతికి అప్పగించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బాధితులకు స్మార్ట్ ఫోన్ లను అప్పజెప్పారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో స్మార్ట్ ఫోన్లను పోగొట్టుకున్నట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ప్రత్యేక టీం ఏర్పాటు చేసారు. నూతనంగా సాంకేతికతను ఉపయోగించి పోగొట్టుకున్న ఫోన్లన్నీ ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోయినప్పటికీ తిరిగి బాధితులకు అప్పజెప్పడంతో బాధితులంతా హర్షం వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా 2,500 లకు పైగా ఫిర్యాదులు అందాయని వాటిలో సాంకేతికత వినియోగించేందుకు వెసులుబాటు ఉన్న వాటిని ఐపీ అడ్రస్ ద్వారా సెల్ ఫోన్లు దొంగిలించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని సైతం పట్టుకోగలిగామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 105 సెల్ఫోన్లను ప్రస్తుతం బాధితులకు అప్పగించగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 900 విలువైన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. స్మార్ట్ ఫోన్ రికవరీ కోసం జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వర్ ఆధ్వర్యంలో ఐటి కోర్ టీం విక్రమ్, పోలీస్ స్టేషన్ ల నుంచి ఇతర సిబ్బంది ఉన్నారని జిల్లా ఎస్పీ తెలిపి స్పెషల్ టీం లో ఉన్న వారిని ప్రశంసించారు.