ఎల్బీనగర్, ఆగస్టు 07: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన దాదాపు 20 ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వివరాలు.. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను గుర్తించి.. దాదాపు 20 ఫోన్ల వరకు రికవరీ చేశారు. రికవరీ చేసిన ఫోన్లను బుధవారం సీఐ వెంకటేశ్వర్లు చేతులమీదుగా బాధితులకు అందజేశారు.