calender_icon.png 18 March, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

48 మొబైల్ ఫోన్ల రికవరీ

18-03-2025 01:10:30 AM

ఖమ్మం, మార్చి 17 ( విజయక్రాంతి ):- పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్ తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లకు సంబంధించి పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్ ట్రాక్ చేసిన ఐటి సెల్ బృందం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం యజమానులకు అడిషనల్ డీసీపీ చేతుల మీదుగా అప్పగించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ విధానంతో సుమారు 7 లక్షల విలువ గల 48 ఫోన్లను గుర్తించామన్నారు.ఈ ఏడాది ఇప్పటికే 680 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోర్టల్  లో ఫిర్యాదులు నమోదు కాగా 582 ఫోన్ల ట్రాక్ ను గుర్తించి 290 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.

సెల్ ఫోన్ల రికవరీ లో కీలకంగా వ్యవహరించిన ఐటి సెల్ నోడల్ ఆఫీసర్ ఏసీపీ వెంకటేశ్, ఎస్త్స్ర సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హెమనాధ్, కానిస్టేబుల్  నరేష్, కానిస్టేబుల్ శ్రీను ను పోలీస్ కమిషనర్ అభినందించారు.