calender_icon.png 26 March, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ

24-03-2025 07:27:08 PM

బాధితులకు అందజేసిన ఎస్సై రాజశేఖర్...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన పలువురు ఇటీవల పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు ఎస్సై రాజశేఖర్ అందచేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గత ఆరునెలల క్రితం సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది సీఈఐఆర్ పోర్టల్ ద్వారా విచారణ జరిపి పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎవరివైన సెల్ ఫోన్లు పోయినట్టయితే వెంటనే 24 గంటల లోపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తద్వార ఫోన్ లను పోర్టల్ ద్వారా రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు ఫోన్లు తమకు దొరకడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.