calender_icon.png 22 February, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో రికార్డుల తనిఖీ

19-02-2025 12:12:39 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ... బీబీపేట  పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం బిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్డు ప్రమాదాలు పూర్వ నేరస్థుల వివరాల రికార్డులను గ్రామాలలోని గస్తీ శాంతి భద్రతల అంశాలను ఎస్త్స్ర ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు.

కొంతమందిపై నమోదైన కేసుల వివరాలతో పాటు రికార్డుల ఉన్న వ్యక్తు లు తప్పించుకుంటూ తిరుగుతున్న వారి వివరాలపై శ్రద్ధపెట్టాలని సూచించారు. గ్రామంలోని జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు నిఘ పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలించాలని వారు అన్నారు. సాధారణ తనిఖీలో భాగంగానే పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.