calender_icon.png 24 October, 2024 | 2:08 AM

జింబాబ్వే రికార్డు స్కోరు

24-10-2024 12:00:00 AM

నైరోబి: అంతర్జాతీయ టీ20ల్లో జింబాబ్వే కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును చెరిపేసి కొత్త రికార్డును సెట్ చేసింది. నైరోబిలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సబ్ రీజనల్ ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో గాంబియా మీద 20 ఓవర్లలో 344-4 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా కేవలం 43 బంతుల్లోనే 133* చేశాడు. చేధనలో గాంబియా 54 పరుగులకే ఆలౌట్ అయింది.