7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు
న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో రికార్డుస్థాయిలో ఐటీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి (2024 25 అసెస్‌మెంట్ సంవత్సరం) గడువుతేదీనాటికి 7.28 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్టు శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.5 శాతం అధికంగా రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ల దాఖలుకు జూలై 31తో గడువు ముగిసింది. ఆ చివరి ఒక్కరోజులో 69.92 లక్షల రిటర్న్‌లు ఫైల్ అయిన ట్టు ఐటీ శాఖ వెల్లడించింది.
తాజా సమీక్షా సంవత్సరంలో 5.27 కోట్ల రిటర్న్‌లు కొత్త పన్ను విధానంలోనూ, 2.01 కోట్ల రిటర్న్‌లు పాత పన్ను విధానంలోనూ దాఖలయ్యాయని పేర్కొంది. పన్ను చెల్లింపుదారుల్లో 72 శాతం మంది కొత్త పన్ను విధానానికే మొగ్గుచూపినట్టు తెలిపింది. 43.82 శాతం మంది ట్యాక్స్‌పేయర్లు ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ను ఫైల్ చేశారన్నది. ఐటీఆర్ ప్రాసె సింగ్‌కు, రిఫండ్‌ల జారీకి ఈ ముఖ్యమైనదని, గడువుతేదీనాటికి 6.21 కోట్ల ఐటీఆర్‌లు ఈవేరిఫై అయ్యాయని, అందులో 93.56 శాతం (5.81 కోట్ల ఐటీఆర్‌లు) ఆధార్ ఓటీపీ ద్వారా ఈవెరిఫికేషన్ జరిగాయని వివరించింది. ఈవెరిఫై అయినవాటిలో జూలై 31నాటికి 2.69 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశామని తెలిపింది.