calender_icon.png 26 March, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు స్థాయిలో అత్యధిక బొగ్గు రవాణా

25-03-2025 05:27:41 PM

ఏరియా జిఎం శాలెం రాజు....

కొత్తగూడెం (విజయక్రాంతి): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఒక్క రోజుకు గాను 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో, సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని, రైలు మార్గం ద్వారా 14 రేకుల బొగ్గు రవాణ, (10 రేకులు జే.వి.ఆర్.సి హెచ్.పి నుండి, మిగిలిన 04 రేకులు ఆర్.సి హెచ్.పి నుండి రవాణా) చేయడం జరిగిందాని కొత్తగూడం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో భాగంగా జేవిఆర్ఓసి-2 నుండి గత సంవత్సరం సాధించిన 110.68 లక్షల టన్నుల కంటే 110.95 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన 138 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 152.85 లక్షల టన్నుల రవాణాను అధిగమించామన్నారు. ఈ రికార్డును నెలకొల్పటంలో యూనియన్ ప్రతినిధులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.