calender_icon.png 29 December, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

29-12-2024 01:31:25 AM

కరీంనగర్, డిసెంనెర్ 28 (విజయక్రాంతి) : వానాకాలం 2024-25 కు సంబంధించి శనిబరం వరకు కరీంనగర్ జిల్లాలో 40,750 మంది రైతుల నుండి 329 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,37,049 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.  అందులో 1,63,117 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం  73,932 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించారు. ఇట్టి కొనుగోలు చేసిన ధాన్యానికి సంభంధించిన మద్దతు ధర 549.94 కోట్లకు గాను 545.94 కోట్లు అనగా 99% రైతుల ఖాతాలో జమ చేశారు. సన్న ధాన్యానికి సంభంధించిన బోనస్ 36.96 కోట్లకు గాను 31.77 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు.  నిరుటితో పోలిస్తే ఈ సంవత్సరం 9513 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా సేకరించారు. మిగతా కొనుగోళ్లు , చెల్లింపులు తదుపరి రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తెలిపారు.