- 49 శాతం వృద్ధితో 11 బిలియన్ డాలర్ల నిధులు
- సీఐఐ-సీబీఆర్‌ఈ అంచనా
న్యూఢిల్లీ, నవంబర్ 20: భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈ క్యాలండర్ సంవత్సరంలో రికార్డుస్థాయిలో ఈక్విటీ పెట్టుబడు లు నమోదవుతాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈలు అంచనా వేశాయి. దేశంలో ప్రాపర్టీలకు పటిష్టమైన డిమాండ్ నెలకొన్నందున, ఈ ఏడా ది దేశీయ రియల్టీ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం వృద్ధిచెంది 11 బిలియన్ డాలర్లకు చేరతాయని బుధవారం సీఐఐ-సీబీఆర్‌ఈలు సంయుక్తంగా రూపొందించిన రిపోర్ట్‌లో వెల్లడించాయి.
2023 క్యాలండర్ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం 7.4 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ లో ఈక్విటీ పెట్టుబడులు 46 శాతం వృద్ధితో 8.9 బిలియన్ డాలర్లకు చేరాయని, ఈ పూర్తి ఏడాదిలో తొలిసారిగా 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటనున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.