మహబూబ్ నగర్, జనవరి 31 (విజయ క్రాంతి) : ఈ సీజన్లో ఇప్పటివరకు ఎప్పుడు లేనంతగా మహబూబ్ నగర్ మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో పల్లి వచ్చింది. ఏకంగా 11,153 క్వింటాళ్ల పల్లి రావడంతో మార్కెట్ అంతా పల్లితో కిక్కిరిసిపోయింది. మార్కెట్ యార్డ్ లోని అంతర్గత రోడ్లపై పల్లి నిండిపోయింది. మరో మరో రైతులు తమకు గిట్టుబాటు కావడం లేదని పల్లి ధర పెంచాలని ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితమే క్వింటాలుకు రూ 200 పెంచడం జరిగిందని సంబంధిత అధికారులు ప్రకటిం చడంతో ఆందోళన రైతులు విరమించారు.