ఏప్రిల్‌లో 18.92 లక్షల సభ్యుల జత
ముంబై, జూన్ 20: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో ఏప్రిల్ నెలలో రికార్డుస్థాయిలో 18.92 లక్షల మంది సభ్యులు జతయ్యారు. 2018 ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పేరోల్ డేటాను విడుదల చేయడం ప్రారంభించినప్పటికీ నుంచి ఒక నెలలో ఇంతమంది కొత్త సభ్యులు సంస్థలో చేరడం ఇదే తొలిసారి. గురువారం ఈపీఎఫ్‌వో విడుదల చేసిన పేరోల్ డాటా ప్రకారం 2024 మార్చితో పోలిస్తే సంస్థలో పెరిగిన నికర సభ్యుల సంఖ్య ఏప్రిల్‌లో 31.29 శాతం వృద్ధిచెందింది. గత ఏడాది ఏప్రిల్‌కంటే 2024 ఏప్రిల్‌లో ఈ వృద్ధి 10 శాతమని ఈపీఎఫ్‌వో తెలిపింది. దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు లభించే ప్రయోజనాల పట్ల అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాల సమర్థత సభ్యత్వ పెంపునకు దోహదపడినట్టు సంస్థ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18 వయస్సుగలవారు 55.50 శాతం ఉన్నారన్నారు.