calender_icon.png 19 January, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం!

19-01-2025 01:11:39 AM

* ఏపీ మంత్రి నారా లోకేశ్ 

హైదారాబాద్, జనవరి 18: తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు.

దివంగత సీఎం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 1.60 లక్షల మంది టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండానే ఇంతమంది సభ్యత్వాలు తీసుకోవడం గొప్ప విషయమని తెలిపారు.