calender_icon.png 11 January, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందరీకరణ పనులు చేపట్టాలి

01-12-2024 12:53:03 AM

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, నవంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని చారిత్రాక ప్రదేశాల్లో సుందరీకరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

శనివారం పట్టణంలోని ధర్మసాగర్ చెరువు, నిర్మల్ కోటలు, శ్యాం ఘాడ్ ప్రాంతంలో చేపట్టే పనులపై అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఫుట్‌పాత్ విస్తరణ, విద్యుదీపాల అలంకరణ, కోటల సుందరీకరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వెంట అధికారులు అశోక్ కుమార్, హరిభూషణ్, రాజు ఉన్నారు.