మంథని (విజయక్రాంతి): యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు మంథని మండల అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో వారి చిత్ర పటాలకు మంగళవారం మంథని అంబేద్కర్ చౌక్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం మండల అధ్యక్షుడు పర్షవేన మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. సదర్ పండుగ వేడుకలను రాష్ట్ర పండుగగా మార్చి, గుర్తింపు తీసుకురావడానికి ప్రత్యేకమైన కృషి చేసిన రాష్ట్ర మంత్రి వర్గానికి, సీఎం కు సహకరించిన అందరికీ మంథని యాదవ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు మోహన్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత పర్వతాలు యాదవ్, మండల ఉపాధ్యక్షులు కనగంటి ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శి భాషా అశోక్ యాదవ్, సీనియర్ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, జాగరి సదానందం యాదవ్, చిన్నవేనా సదానందం యాదవ్, మండల యూత్ సెక్రెటరీ గడ్డి కుమార్ యాదవ్, కావటి సతీష్ యాదవ్, కావటి సందీప్ యాదవ్, కావేటి భూమయ్య యాదవ్, మద్దెల రాజయ్య యాదవ్, కావటి సమ్మయ్య యాదవ్, ఒగ్గు రమేష్ యాదవ్, కనవిన కుమార్ యాదవ్, కనవేనా ఓదెల యాదవ్, పర్శవెన ఓదేలు యాదవ్, మిర్యాల శ్రావణ్ యాదవ్, ధోరగొర్ల శీను యాదవ్, దాసరి చంద్రమోహన్ యాదవ్, అప్పాల అశోక్ యాదవ్, కనవేన స్వామి యాదవ్, పర్షవేన సదానందం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.