calender_icon.png 24 October, 2024 | 5:54 AM

వారిని ఆర్టిజన్లుగా గుర్తించండి

29-07-2024 01:06:18 AM

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ 

జగిత్యాల, జూలై 28 (విజయక్రాంతి): రాష్ర్టంలోని తెలంగాణ స్టేట్ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఆన్ మ్యానీడ్ కార్మికులుగా విధులు నిరహిస్తున్న ఐటీఐ అర్హత కలిగి ఉన్న దాదాపు 1,553 మంది కార్మికులను ఆర్టిజెన్స్‌లుగా గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

తెలంగాణ రాష్ర్టంలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో రాష్ర్టవ్యాప్తంగా 2013లో ఐటీఐ అర్హత కలిగి ఉండి, విద్యుత్ స్తంభం ఎక్కే సామర్థ్యం ఉన్న కార్మికులు 1,607మందిని ఆన్ మ్యానీడ్ కార్మికులుగా నియమించారని తదనంతరం.. అందులో కొందరు విధి నిరహణలో మరణించారని, మిగిలిన 1,553 మంది ఇప్పటికీ నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో ఆన్ మ్యానీడ్ విభాగం కింద కార్మికులుగా విధులు నిరహిస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, విద్యుత్ సమస్యలు సతర పరిష్కారంలో ఫ్యూజ్ ఆఫ్ కాల్, బ్రేక్ డౌన్ 11, 33కేవీ లైన్లలో లోపాలు సవరిస్తూ, లూజ్‌వైర్లు సరిచేస్తూ, చెట్ల కొమ్మలు కొట్టేయడం వంటి అన్నిపనులు చేస్తూ 24 గంటలు వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. 

24 గంటలు అందుబాటులో.. 

విధినిరహణలో అందులో కొంతమంది విద్యుదాఘాతంలో మృతి చెందగా, మరికొంతమంది ప్రమాదాల బారినపడి శాశత అంగవైకల్యంతో బాధపడుతున్నారు. 24గంటలు విధులు నిరహిస్తున్నప్పటికీ వారికి కేవలం రూ.11,731/ వేతనం చెల్లిస్తున్నారని, వివిధ జిల్లాల్లో వేతనాల చెల్లింపుల్లో వ్యత్యాసం ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు దుర్భర జీవితం గడుపుతు న్నారని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ర్టంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒకే రకమైన విధులు నిరహిస్తున్న కార్మికులకు వేరేరుగా పరిగణిస్తూ, ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతోపాటు పోల్ టు పోల్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించి, టీఎస్‌ఎస్‌పీడీసీ పరిధిలో ఐటీఐ అర్హత కలిగి ఉండి ఆన్ నేమ్‌డ్ కార్మికులుగా విధులు నిరహిస్తున్న వారిని ఆర్టీజన్లుగా గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. సబ్ స్టేషన్లలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.25,000 వేతనం చెల్లిస్తూ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఐటీఐ అర్హత కలిగి ఉండి.. క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీలో సమస్యలు తలెత్తకుండా సతరమే విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్న 1,553మంది కార్మికులను ఆర్టీజన్‌లుగా గుర్తించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టగలరని సీఎంకు లేఖరాసినట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.