calender_icon.png 22 November, 2024 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ యూనియన్ గుర్తింపునివ్వండి

22-11-2024 04:08:53 AM

డిప్యూటీ సీఎం భట్టికి ఆర్టీసీ కార్మికుల వినతి

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఇవ్వాలని ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన ఆర్టీసీ యూనియన్ నేతలు మంత్రిని కలిసి తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏడాది గడుస్తున్నా హామీలను అమలు చేయలేదన్నారు. రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ యూనియన్ హక్కులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని కోరారు. కొత్త బస్సులను ఆర్టీసీయే కొని సంస్థను విస్తరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.