03-03-2025 12:44:04 AM
ఘట్‌కేసర్, మార్చి 2(విజయక్రాంతి): ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో కలిసి శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని పేరు, ప్రఖ్యాతలే ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి పేద ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తు చేసి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీజెపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.