దీక్షాంత్ పరేడ్‌లో పీఅండ్‌ఎల్ ఐజీ రమేష్
ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): నీతి నిజాయితీ, నిజాయతీతో పనిచేసిన వారికే వృత్తిలో గుర్తింపు లభిస్తుందని, అలాంటి పోలీసులే ఉన్నతస్థాయికి ఎదుగుతారని పీఅండ్‌ఎల్ ఐజీ రమేష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో గురువారం ఆయన తొమ్మిది నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 254 స్టైఫండరీ ట్రైనీ సివిల్ కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్‌లో ఆయన మాట్లాడారు. వృత్తిలోకి వచ్చిన తర్వాత ప్రతిఒక్కరూ చట్టాన్ని ఉల్లంఘించకుండా, రాజ్యాంగ ధర్మాన్ని పాటిస్తూ విధులను నిరర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. తాను కూడా ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్‌గా శిక్షణ తీసుకున్నట్లు గుర్తుచేశారు.
పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అవినీతి ఆరోపణలుకు తావు లేకుండా, ప్రలోభాలకు గురికాకుండా విధులు నిరర్తించాలన్నారు. ముందుగా ఐజీ ఓపెన్ టాప్ జీప్ నుంచి పోలీస్ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం సీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు కానిస్టేబుళ్లకు బహుమతులు ప్రదానం చేశారు.
శిక్షణ తర్వాత రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, జగిత్యాల్, ములుగు, సంగారెడ్డి తదితర జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లు క్షేత్రస్థాయి విధుల్లోకి వెళతారని పోలీస్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజరి షా, ఎస్పీ గౌష్ ఆలం, 2వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్, అదనపు ఎస్పీ, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ సమయ్‌జాన్ రావు, అదనపు ఎస్పీ (ఆపరేషన్) సురేందర్‌రావు, డీఎస్పీలు జీవన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రకాశ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజరు సిబ్బంది పాల్గొన్నారు.