22-03-2025 11:14:57 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజా ప్రతినిధులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ ఇంటికి బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా వెళ్లి వారితో మాట్లాడారు. కుటుంబ యోగక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బిజెపి పార్టీ విషయాలు తదితర అంశాలపై కార్పొరేటర్ దంపతులు సుప్రియ నవీన్ గౌడ్ తో మాట్లాడి వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కంచికుమార్, నియోజకవర్గ కన్వీనర్ రమేష్ రామ్, బిజెపి రాష్ట్ర నాయకుడు జమాల్పురి నందు, బీజేవైఎం నాయకులు అనిల్ కుమార్, కుశాల్ గౌడ్, అజయ్ గుప్తా, సత్యనారాయణ, ఆయుష్, వెంకటేష్ పాల్గొన్నారు.