- నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- గిరిజనుల సమస్యలపై సాగర్‌లో క్యాంప్
- ఏఐసీసీ జాతీయ నాయకుడు కొప్పుల రాజు
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసినందుకే అధికారంలోకి వచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకు లకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, అటువంటి వారికి త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేశారు.
గాంధీభవన్‌లో పీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్యనాయక్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పీసీసీ చీఫ్ పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రజా సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు తాము చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిం చారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.8 లక్షలకోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించారు. ప్రభు త్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ.. బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేసి న పనులు చెప్పుకోకపోతే వెనుకబడి పోతామని ఆయన అన్నారు.
రాహుల్‌గాంధీ ఆలో చన మేరకే రాష్ట్రంలో కులగణన చేస్తున్నామన్నారు. ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు నాగార్జునసాగర్‌లో వారం రోజులపాటు క్యాంప్ నిర్వహి స్తామని తెలిపారు. రోజుకు ఏడు నుంచి ఎనిమిది అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకో వాలన్నారు.
ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు సన్నద్ధం కావాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆదివాసీ, గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు కూతాడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.