29-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాం తి): త్వరలో పార్టీకి సంబంధించి అన్ని పదవులు నియామక ప్రక్రియ మొదలవుతుం దని, జెండా మోసిన ప్రతి కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హంద న్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమా వేశంలో ఆయన పాల్గొన్నారు.
ముందుగా కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు.ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం తాహెర్ బిన్ హందన్ మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమని, కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల కష్టాల ఫలితమే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉందని 1925లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ అధ్యక్ష పదవి చేప ట్టి వంద సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అందుకే జై బాపు జై భీం జైసంవిధాన్ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు.
పేద బడుగు బలహీ న వర్గాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మండలాల అధ్యక్షులు ఎంపిక..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకే జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అందులో భాగంగానే తమను ఇన్చార్జిలుగా ఇక్కడికి పంపించినట్టు స్పష్టం చేశారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు మండలాల అధ్యక్షులు ఎంపిక పూర్తి జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, ప్రతి పదవికి మూడు పేర్లు పరిశీలనలోకి తీసుకొని నాయకులు, కార్యకర్తల సూచనల ప్రకారం ఎంపిక ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారా యణ, అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఏఐసీసీ సభ్యులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, బోథ్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జిలు ఆడె గజేందర్, శ్యాం నాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.