07-03-2025 12:50:17 AM
ఎమ్మెల్యే మందుల సామేలు
తిరుమలగిరి, మార్చి6: కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపుతో పాటు పదవులు అవే వస్తాయని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల స్వామెల్ అన్నారు. గురువారం తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎల్సోజ్ చామంతి నరేష్ తోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు,
నరేష్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో సామా న్య కార్యకర్తగా అంచలంచలుగా ఎదిగి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినందున ఈరోజు మార్కెట్ కమిటీ పదవి దక్కిందని ఆయన అన్నారు ,కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారి సేవలను పార్టీ గుర్తిస్తుందని అన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినున్నట్లు చెప్పారు. తిరుమలగిరి మండలంలో కోక్యా తండా ను పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేశామని ఆయన చెప్పారు గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆయన చెప్పారు మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమ కోసం రైతుల రైతు పక్షపాతిగా పనిచేసే మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమానికి ముందుగా తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఏల్సోజు చామంతి తో పాటు డైరక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట వ్యవసాయ సహకార కార్పొరేషన్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్ , జిల్లా కాంగ్రెస్ నాయ కులు సుంకరి జనార్ధన్, తుంగతుర్తి మీడి యా ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య. తదితరులు పాల్గొన్నారు