calender_icon.png 18 January, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు

05-07-2024 12:06:00 AM

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ, జూలై 4 (విజయక్రాంతి): అంకితభావంతో పనిచేసే ప్రజాప్రతినిధులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుం దని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కొం డమల్లేపల్లిలో గురువారం జరిగిన ఎంపీపీ దూదిపాల రేఖ పదవీ విరమణ సభకు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి ఆయన హాజరై, మాట్లాడారు. పదవులకు విరమణ ఉంటుంది కానీ ప్రజాసేవకు కాదని పేర్కొన్నారు. మండలాభి వృద్ధికి శ్రమించిన స్థానిక ప్రతినిధులను ఎమ్మెల్యే బాలునాయక్ అభినందించి సత్కరించారు.