calender_icon.png 18 January, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షారూఖ్ ఇంటి వద్ద రెక్కీ?

18-01-2025 01:36:04 AM

  • సైఫ్‌పై దాడికి ముందు షారూఖ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి రెక్కీ
  • సీసీటీవీ పుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • దాడికి పాల్పడింది, రెక్కీ నిర్వహించింది ఒక్కరేనా?

ముంబై, జనవరి 17: ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయి తే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచ లనంగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు సహా సినీ పరిశ్రమ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును తీవ్ర తరం చేశారు.

అయితే సైఫ్‌పై దాడి తర్వాత ఆయన నివాసానికి సంబంధించిన సెక్యూరిటీ వైఫల్యాలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. సైఫ్ తన భార్య పిల్లలతో కలిసి ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న 12 అంతస్తుల సద్గురు శరణ్ భవనంలోని చివరి నాలుగు అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. రూ.45కోట్ల ఈ విలాసవంతమైన భవనంలో స్విమ్మింగ్‌పూల్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇంతటి ఖరీదైన భవనంలోకి దుండగుడు పక్కన ఉన్న మరో బిల్డింగ్ నుంచి గోడ దూకి ప్రవేశించి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భవనానికి సెక్యూరిటీ ప్లానింగ్ సరిగ్గా లేదు అనే వాదన వినిపిస్తుంది. 

అండర్‌వరల్డ్ హస్తంపై మంత్రి కామెంట్స్

సైఫ్ అలీఖాన్‌పై జరిగి దాడిలో క్రిమినల్ గ్యాంగ్‌ల ప్రమేయం ఉందా అని మహారాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్‌ను పూణేలో మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ ఈ ఘటనలో గ్యాంగ్‌ల ప్రమేయం లేదనే విషయం ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

కేవలం చోరీ కోసమే నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు తేలిందన్నారు. ఇదిలా ఉంటే.. సైఫ్‌పై దాడి చేసినట్టుగా భావించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు శుక్రవారం వార్తలొచ్చాయి. అయితే దాడికి సంబంధించిన అనుమానితులెవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు ప్రకటించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. 

దాడికి ముందు షారూఖ్‌ఖాన్ ఇంటి వద్ద రెక్కీ?

సైఫ్ అలీఖాన్ దాడి కేసును విచారిస్తున్న పోలీసులు ఓ కీలక విషయాన్ని గుర్తించారు. మన్నత్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బా లీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఇంటి వద్ద ఈ నెల 14న ఓ గుర్తు తెలియని వ్యక్తి రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.

6 అడుగుల పొడవైన నిచ్చెన సాయంతో షారూఖ్ ఖాన్ ఇంటి పరిసరాలను ఓ గుర్తు తెలియని వ్యక్తి గమనించినట్టు సీసీటీవీలో రికార్డున దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తే షారూఖ్‌ఖాన్ ఇంటి వ ద్ద రెక్కీ నిర్వహించడా లేక ఇద్దరూ వేరు వేరా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బాంద్రా.. బాలీవుడ్ స్టార్ల కాలనీ

ముంబై తీర ప్రాంతంలో ఉన్న బాంద్రా.. బాలీవుడ్ స్టార్ల కాలనీగా గుర్తింపు పొందింది. సైఫ్ అలీఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సోహిల్ ఖాన్, రేఖా, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖుల ఇళ్లన్నీ ఇదే ప్రాంతంలో ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఇక్కడి రోడ్లపై సెలబ్రెటీలు కనిపించడం సర్వసాధారణం.