calender_icon.png 8 February, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా విష్ణు సహస్ర నామార్చన పారాయణం

08-02-2025 08:47:47 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జూనియర్ కాలేజి వేదికగా విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం కార్యక్రమం ఘనంగా జరిగింది. మేళతాళాలు, కొమ్ము నృత్యాలు, విచిత్ర వేషధారణలతో బయలుదేరిన స్వామి వారి శోభాయాత్ర జీయర్ మఠం నుండి కోర్టు ప్రాంగణం బస్టాండ్ మీదుగా జూనియర్ కాలేజీ ప్రాంగణంకు చేరుకుంది. 

శోభాయాత్రలో రామ భక్తులు విచిత్ర వేషధారణలతో మేళతాళాలతో కొమ్ము నృత్యాలతో, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఊరేగింపుగా జీయర్ స్వామి వారి శోభాయాత్ర జరిగింది. వేదిక వద్దకు చేరుకున్న జీయర్ స్వామి జీయరమఠం జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై నుండి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ... విష్ణు ఏకాదశి సహస్ర పారాయణం గురించి వివరించారు. అనంతరం హాజరైన భక్తులతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమును జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పట్టణ ప్రముఖులు పాకాల పాటి దుర్గాప్రసాద్ తో పాటు సభ్యులు వేద పండితులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.