calender_icon.png 21 January, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ

21-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేయనున్న రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, లతో కలిసి ఆర్డీవోలు, జిల్లా, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు,  తహసీల్దార్ లతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే పరిశీలన ప్రక్రియ, గ్రామ/వార్డు సభల నిర్వహణపై (టెలీ కాన్ఫరెన్స్) ద్వారా సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేసి, వారి సందేహాలను నివృత్తి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిర్వహిస్తోన్న క్షేత్రస్థాయి సర్వే పరిశీలనలో అలసత్వం వహించకుండా వేగవంతం చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించ డంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని, పరిశీలించడం జరుగుతుందని వివరించారు.

గ్రామ సభలకు హాజరయ్యే అధికారుల, ప్రజల సంతకాలను తీసుకో వాలని, లబ్ధిదారుల ముసాయిదా జాబితాను పారదర్శకంగా రూపొందించా లని, అందుకు తగ్గట్లుగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్సులో అన్ని మండలాల తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్స్, ఎంపిడిఓలు పాల్గొన్నారు.