calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి తుమ్మల చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న

12-04-2025 12:12:25 AM

డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 11: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదుగా సర్టిఫికెట్ను కొత్తకుర్మ సత్తయ్య అందుకున్నారు. శుక్రవారం హెచ్.వై.ఎం సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు, బ్యాంకు పాలసీలు, లావాదేవీలు, ఆడిట్ విధానాలు, నిర్వహణ ప్రమాణాలను పరిశీలించి, నాణ్యత ప్రమాణాల ప్రకారం ఈ సర్టిఫికేషన్ను మంజూరు చేశారు.

హెచ్డిసిసిబి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కు ISO 9001:2015 సర్టిఫికేషన్ ను తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య సర్టిఫికెట్ను అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ భాస్కర సుబ్రమణ్యం, జనరల్ మేనేజర్లు ప్రభాకర్ రెడ్డి, ఫణి శ్రీరామ్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు నాగంజలి, కిరణ్ మరియు హెచ్.వై.ఎం సంస్థ కన్వీనర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు