హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు సంస్కరణలు తీసుకురానుంది. ఈక్రమంలో విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తోంది. www.tgche. ac.in.లో సూచనలు చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పరిశ్రమల కోసం పాఠ్యప్రణాళిక పునరుద్ధరణ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్‌షిప్, నైపుణాభివృద్ధిని ప్రోత్సహించడం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు, నాణ్యత పెరుగుదలతో పాటు ఇతర అంశాలపై సూచనలు చేయాలని తెలిపారు.
దీంతోపాటు ఉన్నత విద్యామండలి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొ న్నారు. మార్కెట్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయే ట్ పాఠ్యాంశాలను మార్పులు చేసేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ తెలిపారు.